calender_icon.png 11 October, 2025 | 11:35 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నగదు సహాయంతో మానవత్వం చాటుకున్న సభ్యులు

11-10-2025 06:25:10 PM

పెబ్బేరు రూరల్: ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో డబ్బులు కట్టలేక మధ్యలో చదువు ఆగిపోయిన ఒక విద్యార్థినికి నగదు ఆర్థిక సహాయం చేసి వారి మానవత్వాన్ని చాటుకున్నారు. వివరాల్లోకి వెళితే పెబ్బేరు మండలం సూగూరు గ్రామానికి చెందిన జయలక్ష్మి,హైదరాబాద్ లో గల శ్రీదేవి ఉమెన్స్ ఇంజనీరింగ్ కళాశాలలో సిఎస్సి విభాగంలో మూడవ సంవత్సరం చదువుతుంది. ఇటీవల తండ్రి అనారోగ్యంతో మరణించారు. తల్లి దినసరి కూలిగా పనిచేస్తుంది.

ఇంట్లోని ఆర్థిక పరిస్థితి నేపథ్యంలో కాలేజిలో ఇంకా కట్టవలసిన రూ.35 వేలను విద్యార్థిని జయలక్ష్మి కట్టలేకపోవడంతో కాలేజీ యాజమాన్యం ఫీజు చెల్లించిన తర్వాతనే కళాశాలకు రమ్మన్నారు. దీంతో పరిస్థితి లేక అమ్మాయి కాలేజీ ఫీజు కోసం సోషల్ రెస్పాన్సిబిలిటీ టీంను సంప్రదించడంతో టీం సభ్యులు సూగూర్ వెళ్లి అమ్మాయికి కావలసిన కాలేజీ ఫీజుతో పాటు అదనంగా ఖర్చుల నిమిత్తం పదైదు వేలు కలిపి మొత్తం 45 వేల రూపాయలను చెక్కు రూపేన నగదును అందించడం జరిగింది. ఈ ఆర్థిక సహాయం పట్ల విద్యార్థిని మరియు తల్లి టీం సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు.