calender_icon.png 5 May, 2025 | 11:53 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాజీవ్ యువ వికాసం పథకానికి సిబిల్ స్కోర్ తో ముడిపెట్టొద్దు

05-05-2025 06:44:26 PM

తెలంగాణ దళిత హక్కుల పోరాట సమితి వరంగల్ జిల్లా అధ్యక్షులు సంఘీ ఏలేందర్..

హనుమకొండ (విజయక్రాంతి): రాజీవ్ యువ వికాస పథకాన్ని సిబిల్ స్కోర్ ఆధారంగా అమలు చేయడం వల్ల అసలు లబ్ధి పొందాల్సిన పేద ప్రజలకు అందని ద్రాక్షగా మారుతుందని తెలంగాణ దళిత కుల పోరాట సమితి వరంగల్ జిల్లా అధ్యక్షులు సంఘీంధర్ పేర్కొన్నారు. ఇప్పటికే బ్యాంకు బాధితులుగా మారిన ఎంతోమంది పేద కుటుంబలు గతంలో తీసుకున్న లోన్లు వాటికి సంబంధించిన చెల్లింపులు కట్టాని కారణంగా వారి సిబిల్ స్కోర్ దెబ్బతింది అన్నారు. ఇప్పుడు సిబిల్ స్కోర్ ను రాజీవ్ యువ వికాస పథకానికి అర్హతగా మారిస్తే దాదాపు 40 శాతం దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యే అవకాశం ఉందని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే బ్యాంకు అధికారులతో చర్చించి సిబిల్ స్కోర్ వంటి అడ్డంకులను తొలగించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.