05-05-2025 06:40:53 PM
ఎస్పీ కిరణ్ ఖరే..
కాటారం/భూపాలపల్లి (విజయక్రాంతి): ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే(District SP Kiran Khare) అన్నారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజా దివాస్ కార్యక్రమంలో భాగంగా ఎస్పీ కిరణ్ ఖరే వివిధ మండలాల నుంచి వచ్చిన బాధితుల నుంచి 16 పిర్యాదులు స్వీకరించి, వారి సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వకంగా ఉంటూ వారి సమస్యలను ఓపికతో విని పరిష్కరించాలన్నారు. డ్రగ్స్, మత్తు పదార్థాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. బాధితుల సమస్యలు సత్వరంగా పరిష్కరించాలని సంబధిత పోలీసు అధికారులను ఎస్పీ కిరణ్ ఖరే ఆదేశించారు.