calender_icon.png 12 December, 2025 | 8:13 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శామీర్‌పేటలో బిఆర్ఎస్ నాయకులు అరెస్ట్

12-12-2025 06:47:58 PM

శామీర్ పేట్: బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ ను శామీర్‌పేట పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళ్లగా.. గురువారం బీసీ గురుకుల పాఠశాల విద్యార్థులు వారి సమస్యలపై రెండు కిలోమీటర్ల మేర నడుచుకుంటూ వెళ్లి శామీర్‌పేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన విషయం విధితమే. కాగా సమాచారం తెలుసుకున్న రాష్ట్ర బీఆర్ఎస్వీ అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్, బిఆర్ఎస్ నాయకులతో కలిసి శుక్రవారం శామీర్ పేట లోని బీసీ గురుకుల పాఠశాలను సందర్శించి అక్కడి విద్యార్థులతో వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని  గెల్లు శ్రీనివాస్ యాదవ్ తో పాటు కొంతమంది బిఆర్ఎస్ నాయకులను  అరెస్టు చేసి శామీర్ పేట్ పోలీస్ స్టేషన్కు తరలించారు.