12-12-2025 06:41:22 PM
మోతె,(విజయక్రాంతి): జానిమియా మృతి కాంగ్రెస్ పార్టీకి తీరని లోటని మండల మాజీ జడ్పీటీసీ పందిళ్ళ పల్లి పుల్లారావు అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని రావి పహాడ్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు షేక్ జానిమియా వయస్సు 90 పార్టీకి అందించిన సేవలు గ్రామంలో అభివృద్ధికి బాటలు వేశాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కోట సుధాకర్ రెడ్డి, సర్పంచ్ అభ్యర్థి తండు నాగమని సతీష్, కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.