12-12-2025 06:34:45 PM
ఎన్నికల్లో గెలుపు ఓటములు సహజమే
నిరంతరం మీ సేవలో ఉంటూ మంత్రి శ్రీధర్ బాబు, శీను బాబు ఆదేశాలతో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తా
ముత్తారంలో విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థి నూనెటి కృష్ణ
ముత్తారం: ముత్తారం గ్రామ ప్రజల తీర్పును స్వీకరిస్తానని, ఎన్నికల్లో గెలుపు ఓటములు సహజమేననీ ఓటమి చెందిన నిరంతర మీ సేవలో ఉంటూ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు, యువ నాయకుడు శ్రీను బాబు ఆదేశాలతో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని, ముత్తారం మండల కేంద్రంలో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి నూనెటి కృష్ణ అన్నారు. గురువారం నిర్వహించిన సర్పంచ్ ఎన్నికల్లో తనకు 813 ఓట్లు వేసిన ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపాడు.
తనపై నమ్మకంతో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సర్పంచ్ అభ్యర్థిగా ప్రకటించిన మంత్రి శ్రీధర్ బాబుకు, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి శ్రీనుబాబుకు మాజీ జడ్పిటిసి చొప్పరి సదానందం, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు దొడ్డ బాలాజీ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు తన గెలుపు కోసం ఎంతో కష్టపడి కృషి చేశారని కొనియాడారు. కొన్ని కారణాలవల్ల ఓటమిపాలైనప్పటికీ, ఓటమి చెందడానికి కారణాలను విశ్లేషించి జరిగిన తప్పులను సరిదిద్దుకొని కాంగ్రెస్ పార్టీ నాయకులను కార్యకర్తలను కలుపుకొని పోయి గ్రామ ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండి మంత్రి శ్రీధర్ బాబు, శ్రీను బాబు మండల నాయకుల సహకారంతో పని చేస్తానని కృష్ణ తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.