calender_icon.png 12 December, 2025 | 7:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నూతన సర్పంచ్‌లను సన్మానించిన మాజీ డిసిసి అధ్యక్షులు శ్రీహరి రావు

12-12-2025 06:37:24 PM

నిర్మల్,(విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల నమ్మకానికి సర్పంచ్ ఫలితాలు నిదర్శనంగా నిలిచాయని నిర్మల్ నియోజకవర్గ ఇన్చార్జి కూచాడి శ్రీహరి రావు అన్నారు. మొదటి విడత సర్పంచ్ ఎన్నికల్లో విజయం సాధించిన మామడ, లక్ష్మణ్ చాందా మండలంలోని సర్పంచులను జిల్లా కేంద్రంలోని ఆయన నివాసంలో శుక్రవారం శాలువాతో సత్కరించి అభినందించారు.

మొదటి విడత ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతు ఇచ్చిన అభ్యర్థులే విజయం సాధించారని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రెండేళ్ల ప్రజాపాలన సంక్షేమం, అభివృద్ధి పథకాలతో ప్రజలకు చేరువైందని అన్నారు. ఈ సందర్భంగా శ్రీహరి రావు గారు గాయిద్ పల్లి సర్పంచ్ సోనియా సంతోష్, గోల్డ్ కూడా మూతి బాయ్, అనంతపేట తిరుమల్, కిషన్ రావు పేట వసంతరావు, న్యూ లింగంపల్లి సర్పంచ్ బీమా గంగన్న, రాయదారి సర్పంచ్ బంక తిరుపతి లను శాలువా తో సన్మానించారు.