calender_icon.png 12 December, 2025 | 7:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కీ.శే.మణిపాల్ రెడ్డి జయంతిని ఘనంగా నిర్వహించిన లయన్స్ క్లబ్

12-12-2025 06:44:44 PM

పదవ తరగతి విద్యార్థులకు ‘ఆల్ ఇన్ వన్’ పుస్తకాల పంపిణీ

ఉప్పల్,(విజయక్రాంతి): కమలానగర్ స్ఫూర్తి క్లబ్ నిర్మాత కీ.శే.మణిపాల్ రెడ్డి నాలుగో వర్థంతి జ్ఞాపకార్థం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో శుక్రవారం సేవా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా యాప్రల్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి విద్యార్థులకు ‘ఆల్ ఇన్ వన్’ పాఠ్యపుస్తకాలను మాజీ కార్పొరేటర్ పజ్జురి పావని మణిపాల్ రెడ్డి, లయన్స్ క్లబ్ సభ్యులు కలిసి అందజేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కుషాయిగూడ జోన్ అదనపు డిప్యూటీ కమిషనర్ నల్లమోతు వెంకటరమణ పుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

అనంతరం మాట్లాడుతూ మణిపాల్ రెడ్డి నాకు అత్యంత సన్నిహిత మిత్రుడు. ఆయన ఎప్పుడూ సేవాభావంతో ఆలోచించేవారు. ప్రతి సారి కలిసినప్పుడు ప్రజల కోసం చేయాల్సిన సేవా కార్యక్రమాలపై చర్చించేవారు. అలాంటి మంచి మిత్రుడిని కోల్పోవడం బాధాకరం అన్నారు. కీర్తిశేషులు మణిపాల్ రెడ్డి స్ఫూర్తిగా లయన్స్ క్లబ్ చేపట్టే సేవా కార్యక్రమాలు మరింత విస్తరించాలని ఆయన సూచించారు.