calender_icon.png 12 December, 2025 | 7:53 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రచారం చివరి రోజు కావడంతో కాంగ్రెస్ ప్రచారం జోరు

12-12-2025 06:27:07 PM

మోతె,(విజయక్రాంతి): శుక్రవారం మండల పరిధిలోని గోపతండ గ్రామంలో ప్రచారం చివరి రోజు కావడంతో కాంగ్రెస్ పార్టీ ప్రచారం జోరుగా కొనసాగింది. కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి భూక్య బిక్కు మాట్లాడుతూ... గ్రామంలో నేటికి పరిస్కారం కానీ సమస్యలు అన్ని ఒక్కొకటి గా పరిస్కారం చేస్తామని చెప్పారు. ఇందిరమ్మ ఇండ్లు, అర్హులైన వారికి పెన్షన్లు, సి సి రోడ్ల నిర్మాణం చేయడం జరుగుతుందని వీధి దీపాలు వేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో గ్రామ నాయకులు, గ్రామ పెద్దలు, కార్యకర్తలు  తదితరులు పాల్గొన్నారు.