calender_icon.png 23 August, 2025 | 11:20 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గుండెపోటుతో శశికాంత్ మృతి.. కుటుంబానికి అండగా ఉంటా..

23-08-2025 07:20:55 PM

రాష్ట్ర రైతు కమిషన్ సభ్యులు చెవిటి వెంకన్న యాదవ్..

తుంగతుర్తి (విజయక్రాంతి): సూర్యాపేట జిల్లా(Suryapet District) మద్దిరాల మండల పరిధిలోనీ గుమ్మడవెల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్త తడకమళ్ళ శశికాంత్(36) శనివారం గుండెపోటుతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర రైతు కమిషన్ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు చెవిటి వెంకన్న యాదవ్ శశికాంత్ కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన, పార్థివదేహానికి రేతినేని శ్రీనివాసరావుతో కలిసి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కాంగ్రెస్ పార్టీతో ముఖ్యంగా నాతో ఉన్న అనుబంధాన్ని గురించి ఈ సందర్భంగా ఆయన గుర్తు చేసుకున్నారు.

గ్రామస్థులకు అత్యంత సన్నిహితంగా ఉండే శశికాంత్ ను కోల్పోవడం చాలా బాధాకరంగా ఉందని ఈ సందర్భంగా వెంకన్న యాదవ్ తెలిపారు. భవిష్యత్తులో శశికాంత్ కుటుంబ సభ్యులకు అన్ని రకాలుగా సహాయ సహకారాలను అందించనున్నట్టుగా చెప్పారు. డప్పు కళాకారుల ఆటపాటలు, బంధుమిత్రుల అశ్రునయాల మధ్య శశికాంత్ అంతిమయాత్ర కొనసాగింది.వెంకన్న యాదవ్ వెంట కాంగ్రెస్ పార్టీ నాయకులు పోలేపాక రామచంద్రు, కొండగడుపుల శ్రీకాంత్, నాగయ్య, వల్లపు మహేష్ గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.