calender_icon.png 23 August, 2025 | 11:48 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

23 వారాల శిశువుకు చికిత్స విజయవంతం

22-08-2025 02:12:46 AM

మెడికవర్ హాస్పిటల్ బృందం అరుదైన ఘనత

హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 21 (విజయక్రాంతి): హైదరాబాద్‌లోని మెడికవర్ ఉమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్స్, నియోనాటల్ వైద్యంలో అద్భుతమైన పురోగతిని సాధించింది. కేవలం 23 వారాల గర్భధారణతో పుట్టిన శిశువును విజయవంతంగా డిశ్చార్జ్ చేసింది. ఇంత తక్కువ సమయంలో పుట్టిన శిశువులు బతకడం ప్రపంచవ్యాప్తంగా చాలా అరుదు. ఏప్రిల్ 18న జన్మిం చిన ఈ ఆడ శిశువు, పుట్టినప్పుడు కేవలం 565 గ్రాముల బరువు ఉంది.

శిశువును వెంటనే నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో చేర్చారు. చికిత్సలో 6 రోజులు వెంటిలేషన్, 78 రోజులు బబుల్ సీపాప్, హెచ్‌ఎఫ్‌ఎన్సీ సపోర్ట్, చిన్నపాటి ఇన్ఫెక్షన్లకు చికిత్స, బ్లడ్ ట్రాన్స్‌ఫ్యూజన్‌లు, గుండె, మెద డు, రెటీనా అభివృద్ధిని నిరంతరం పర్యవేక్షించారు. అనంతరం నిర్వహించిన పరీక్షల్లో ఆమె ఆరోగ్యకరంగా ఉంది.  దీంతో ప్రిమెచ్యూర్ కాంప్లికేషన్లు లేకుండా డిశ్చార్జ్ చేశారు.

చీఫ్ కన్సల్టెంట్ నియోనాటాలజిస్ట్ డాక్టర్ రవీందర్ రెడ్డి మాట్లాడుతూ ‘23 వారాలకు పుట్టిన శిశువు బతకడం చాలా అరుదు. దీనికి నిరంతర పర్యవేక్షణ, అధునాతన నియోనాటల్ చికిత్సలు అవసరం’ అని పేర్కొన్నారు. ఆపరేషన్ విజయవంతం కావడంలో కీలకపాత్ర పో షించిన వారిలో కన్సల్టెం ట్ ఆబ్సెట్రి షియన్ డాక్టర్ రాధి క, డాక్టర్ నవిత, డాక్టర్ వంశీరెడ్డి, డాక్టర్ ప్రశాంతి, సిబిల్ థామస్ (ఎన్‌ఐసీయూ హెడ్ నర్స్), సెంటర్ హెడ్ ప్రసాద్, మెడికల్ సూపరింటెండెంట్ వెంకట్ ఉన్నారు.