23-08-2025 07:05:51 PM
కొత్తపల్లి (విజయక్రాంతి): ఇందిరమ్మ ఇళ్లు, రాజీవ్ యువ వికాస్, కొత్త ఆసరా పెన్షన్ లను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ శనివారం రోజున కొత్తపల్లి రూరల్ బీజేపీ మండల శాఖ అధ్యక్షులు కుంట తిరుపతి ఆధ్వర్యంలో స్థానిక ఎంపీడీవో కార్యాలయం వద్ద ధర్నా చేయడం జరిగింది. ఈ ధర్నాను ఉద్దేశించి కుంట తిరుపతి మాట్లాడుతూ, మోసపూరిత హామీలను ఇచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలం అయిందని, నిరుపేదలపైన కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే స్పందించి అర్హులైన ప్రతీ పేదవారికి ఇందిరమ్మ గృహం, దరఖాస్తు చేసుకున్న నిరుద్యగులందరికీ రాజీవ్ యువవికాస్ లబ్ది చేకూర్చాలన్నారు. వితంతువులు, వికలాంగులు కొత్త పెన్షన్ లు మంజూరు కోసం చూస్తున్నారని, ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని లేనిపక్షాన ప్రజలను మమేకం చేసి ఉద్యమించడానికి బిజెపి పార్టీ సిద్ధంగా ఉంటుందని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కౌన్సిల్ మెంబర్ వేముల అనిల్ కుమార్, మాజీ మండల అధ్యక్షులు కడార్ల రతన్ కుమార్, సీనియర్ నాయకులు జవ్వాజి రమేష్ ,సోమినేని కర్ణాకర్ ,బోనాల నరేష్ ,కడారి శ్రీనివాస్ ,పోర్తి అనిల్ కట్ల శ్రీనివాస్ బైరెడ్డి వంశీ,మెరుగు మల్లేశం ,బోయినీ మహేందర్ ,ఉప్పు ప్రశాంత్, ఆరే నరేష్, చిన్నబోయిన శ్రీనివాస్, సంపత్ చారి, జిందం సుకుమార్, బోనాల అంజన్న, నార్ల రాములు,కట్ల వెంకటేష్, తదితరులతోపాటు వివిధ గ్రామాల బూత్ అధ్యక్షులు పాల్గొన్నారు.