calender_icon.png 23 August, 2025 | 11:18 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతులు పడుతున్న గోస ఎవరికి చెప్పాలి

23-08-2025 07:19:44 PM

ములుగు జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కాకులమర్రి లక్ష్మణ్ బాబు 

ములుగు నియోజకవర్గ ఇంచార్జ్ బడే నాగజ్యోతి

మంగపేట,(విజయక్రాంతి): ఇటీవల ఎడతెరపి లేకుండా కురిసిన భారీ వర్షాలకు మండలంలోని రైతులు తీవ్రంగా నష్టపోయారని వారికి నష్టపరిహారం చెల్లించకుండా ప్రభుత్వం మొండి వైఖరిని ప్రదర్శిస్తుంది రైతుల పడుతున్న గోస ఎవరికి చెప్పాలని ములుగు జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కాకులమార్రి లక్ష్మణ్ బాబు ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు. పంటలు నష్టపోయిన రైతులకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించే వరకు ధర్నాలు రాస్తారోకో లు కొనసాగుతూనే ఉంటాయని దీనిలో భాగంగా శనివారం మంగపేట మండలం మల్లూరు జాతీయ రహదారిపై బైఠాయించి రైతన్నలు పడుతున్న హరిగోస కనబడతలేదా వినపడతలేదా అని నినాదాలు చేశారు.