23-08-2025 07:07:57 PM
హన్మకొండ,(విజయక్రాంతి): సిపిఐ జాతీయ నాయకుడు, మాజీ ఎంపీ, ఆల్ ఇండియా కమ్యూనిస్ట్ పార్టీకి 50 ఏళ్లకు పైగా అచంచలంగా సేవలందించిన సూరవరం సుధాకర్ రెడ్డి మృతి పట్ల శనివారం షాప్, షాపింగ్ మాల్స్ వర్కర్స్ యూనియన్, ఎఐటియుసి హనుమకొండ జిల్లా సమితి ఆధ్వర్యంలో హనుమకొండ చౌరస్తాలో ఆర్ జీవన్ లాల్ కాంప్లెక్స్ లో సురవరం సుధాకర్ రెడ్డి మృతికి సంతాపం తెలిపారు. ఎఐటీయూసీ హనుమకొండ జిల్లా సమితి అధ్యక్షులు వేల్పుల సారంగపాణి యాదవ్ మాట్లాడుతూ... సురవరం సుధాకర్ రెడ్డి చిన్ననాటి నుంచే వామపక్ష ఉద్యమాల పట్ల ఆకర్షితులై, విద్యార్థి దశ నుంచే సిపిఐ లో చురుకుగా పనిచేశారని
ఆయన పార్లమెంట్ సభ్యునిగా పనిచేసినప్పుడు కార్మిక వర్గాల సమస్యలను బలంగా లేవనెత్తి, శ్రామిక హక్కుల కోసం గళమెత్తారని. ఆయన చేసిన కృషి, త్యాగాలు కార్మిక వర్గం, వ్యవసాయ కూలీలు, బలహీన వర్గాల హక్కుల సాధనకు అంకితం చేసిన కార్మిక పక్షపాతని సిపిఐ జాతీయ కార్యదర్శిగా ఆయన పార్టీని బలోపేతం చేయడానికి, వామపక్ష ఉద్యమాలను ఏకం చేయడానికి, ప్రజాస్వామ్య పరిరక్షణకు అహర్నిశలు శ్రమించారని ఆయన చేసిన పోరాటాలు, త్యాగాలు భవిష్యత్ తరాలకు మార్గదర్శకం అవుతాయని తెలిపారు. ముందుగా సభలో పాల్గొన్న నాయకులు, కార్యకర్తలు అందరూ సుధాకర్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి విప్లవ జోహార్లు అర్పించారు.