23-08-2025 07:03:51 PM
తరిగొప్పుల,(విజయక్రాంతి): మండల కేంద్రంలో స్థానిక రైతు వేదికలో ఎల్డిసి జాగృతి, మోడర్న్ ఆర్కిటెక్ ఫర్ రూరల్ ఇండియా (మారి) ఫౌండేషన్ బెటర్ కాటన్ ప్రాజెక్టులో భాగంగా లూయిస్ బైపాస్ కంపెనీ ఆధ్వర్యంలో శనివారం రోజున రైతులకు అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏరువాక వ్యవసాయ కేంద్ర ప్రధాన శాస్త్రవేత్త అనిల్ కుమార్ మాట్లాడుతూ... గులాబీ రంగు పురుగు నివారణ మరియు నష్ట పరిమిత శాతాన్ని గుర్తించి నివారించడానికి తగు చర్యల గురించి వివరించడం జరిగింది. మారి ఎల్డిసి సంస్థల ఆధ్వర్యంలో లింగార్చన బుట్టలు పంపిణీ చేశారు.