calender_icon.png 23 August, 2025 | 11:35 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మాక్ పోలింగ్

23-08-2025 07:17:40 PM

మహదేవపూర్/భూపాలపల్లి (విజయక్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా(Jayashankar Bhupalpally District) మహాదేవపూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మాక్ పోలింగ్ ప్రిన్సిపాల్ నరసయ్య ఆధ్వర్యంలో శనివారం నిర్వహించారు. అనంతరం ప్రిన్సిపాల్ మాట్లాడుతూ, విద్యార్థులకు ఓటు హక్కుపై అవగాహన కల్పించడం జరిగిందని, అందులో భాగంగానే విద్యార్థులచే మాక్ పోలింగ్ నిర్వహించామని తెలిపారు. ఇంటర్ బోర్డు జూనియర్ కళాశాల విద్యార్థులకు ముఖ గుర్తింపు హాజరు ద్వారా విద్యార్థుల హాజరును పర్యవేక్షణ చేస్తున్నదని, కళాశాల విద్యార్థులు క్రమం తప్పకుండా కళాశాలకు హాజరుకావాలని, 75% హాజరు లేనిచో విద్యార్థుల కు బోర్డ్ ఎగ్జామ్స్ లో పరీక్షలు వ్రాసేందుకు అనుమతి ఉండదని ఇట్టి విషయాన్ని విద్యార్థులు, తల్లిదండ్రులు గమనించి విద్యార్థులు కళాశాలకు గైర్హాజరు కాకుండా చూడాలని తెలిపారు. ఇట్టి కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు.