calender_icon.png 23 August, 2025 | 11:30 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ముంపు గ్రామాలను పరిశీలించిన ఎమ్మెల్యే

23-08-2025 07:12:19 PM

బెల్లంపల్లి,(విజయక్రాంతి): భీమిలి మండలం పెద్దపేట గ్రామంలో నీట మునిగి ముంపుకు గురైన పొలాలను, దెబ్బతిన్న రహదారులతో పాటు కన్నెపల్లి మండలంలోని సాలిగాం గ్రామంలో పాల్వాయి పురుషోత్తమరావు ప్రాజెక్టు వల్ల ముంపుకు గురైన ప్రాంతాలను శనివారం బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ పరిశీలించారు. ముంపు బాధితులకు ప్రభుత్వం ద్వారా పరిహారం అందించేలా చూస్తానని హామీ ఇచ్చారు.