calender_icon.png 23 August, 2025 | 11:39 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రక్తదాన శిబిరం..

23-08-2025 07:09:19 PM

నస్పూర్ (విజయక్రాంతి): దేశవ్యాప్తంగా బ్రహ్మ కుమారీస్ సోషల్ వింగ్ నిర్వహిస్తున్న రక్తదాన శిబిరాలలో భాగంగా శనివారం మంచిర్యాల బ్రహ్మ కుమారీస్ ఆర్గనైజర్స్ సభ్యుల ఆధ్వర్యంలో సీసీసీ నస్పూర్ సింగరేణి పాలిటెక్నిక్ కళాశాల(Singareni Collieries Polytechnic)లో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఇందులో 41 మంది విద్యార్థులు రక్తదానం చేశారు. అనంతరం రక్త దాతలకు ప్రశంషా పత్రాలను అందజేసి సేకరించిన యూనిట్లను ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటి రక్తనిధి కేంద్రానికి అప్పగించారు.

ఈ కార్యక్రమంలో బ్రహ్మ కుమారీస్ ఆర్గనైజర్స్ బ్రాంచి ఇంఛార్జీ రమాదేవి, డాక్టర్ జ్యోతి, శ్రీవాణి, సతీష్, పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాస్ రావు, ఎలక్ట్రికల్ హెచ్ఓడీ నారాయణ మూర్తి, మైనింగ్ హెచ్ఓడీ నరసింహా స్వామి, కంప్యూటర్ సైన్స్ హెచ్ఓడీ రవీందర్, మెకానికల్ హెచ్ఓడీ దామోదర్, సివిల్ హెచ్ఓడీ శ్యామల, మైనింగ్ హెచ్ఓడీ సుమన్, ఐఆర్సీఎస్ జిల్లా ఛైర్మన్ కంకణాల భాస్కర్ రెడ్డి, జిల్లా జనరల్ సెక్రెటరీ చందూరి మహేందర్ తదితరులు పాల్గొన్నారు.