24-09-2025 12:24:10 AM
మహబూబాబాద్, సెప్టెంబర్ 23 (విజయక్రాంతి): జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్, ఎస్పీ కేకన్ సుధీర్ రామ్నాథ్ హామీ మేరకు మహబూబాబాద్ జిల్లా ప్రధాన ఆసుపత్రి వైద్యులు సిబ్బంది ఆందోళన విరమించారు. ఓ మహిళ అనారోగ్యానికి గురై ఆసుపత్రికి రాగా, సకాలంలో వైద్య సహాయం అందించడంలో వైద్యులు, ఆసుపత్రి సూపరిండెంట్ నిర్లక్ష్యం వహించడం వల్ల మరణించిందని మృతురాలి బంధువులు వైద్యులు, సిబ్బందిపై దూషణ పర్వంతో పాటు దాడికి యత్నించిన ఘటన నేపథ్యంలో మంగళవారం వైద్యులు, సిబ్బంది విధులు బహిష్కరించి ఆసుపత్రి వద్ద ధర్నా నిర్వహించారు.
దీంతో ఆస్పత్రిలో ఉన్న రోగులకు వైద్య సహాయం నిలిచిపోయి అసౌకర్యం కలిగింది. వెంటనే ఈ విషయాన్ని తెలుసుకున్న డి.ఎస్.పి తిరుపతిరావు అక్కడికి చేరుకొని వైద్యులతో మాట్లాడారు. వైద్యం అందించడంలో నిర్లక్ష్యం చూపలేదని, తమను ఇష్టానుసారంగా తిట్టడం, దాడికి యత్నించడం సరికాదని, ఇలాంటి ఘటనల వల్ల తమకు ప్రాణహాని ఉందని డిఎస్పీకి వివరించారు. ఈ విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్, ఎస్పీ కేకన్ సుధీర్ రామ్నాథ్