24-09-2025 12:23:07 AM
హైదరాబాద్ సిటీ బ్యూరో, సెప్టెంబర్ 23 (విజయక్రాంతి): అంతర్జాతీయ యువత ఉపాధి నిపుణుడు, గెట్ జాబ్ రెడీ పుస్తక రచయిత వాసు ఎడా.. మంగళవారం కలల ఉద్యోగాన్ని కాలేజీ బయట ఎలా సాధించాలి అనే అంశంపై ప్రత్యేక ఉపన్యాసాన్ని అందించారు. ఈ సందర్భంగా వాసు మా ట్లాడుతూ.. కలల ఉద్యోగాన్ని పొందడం కోసం కేవలం విద్యార్హతలే కాకుండా మరె న్నో నైపుణ్యాలు అవసరమని తెలిపారు.
జ్ఞానం మరియు సర్టిఫికేషన్లు, ఉపాధి నైపుణ్యాలు, ఉద్యోగ అన్వేషణ సిద్ధత, ప్రాక్టికల్ నైపుణ్యాలు, రిజ్యూమ్ సిద్ధం చేయడం, ఇంటర్వ్యూ చేసేవారిని ఆకర్షించడం, సమయపాలన వంటి అంశాల ప్రాముఖ్యతను వివరించారు. విద్యార్థులను ఇంటర్న్షిప్స్, ప్రాజెక్టులు మరియు పాఠ్యేతర కార్యక్రమాలలో పాల్గొనమని ప్రోత్సహించారు.
తద్వా రా ఉపాధి అవకాశాలను పెంపొందించుకోవచ్చు అని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఇన్-ఛార్జ్ ప్రిన్సిపల్ డాక్టర్ పి. వేణుప్రియ, చైర్‌పర్సన్ డాక్టర్ కె. భారతి, సెక్రటరీ వై సత్యనారాయణరావు పాల్గొని వాసుకు కృతజ్ఞతలు తెలిపారు.