12-08-2024 01:59:44 AM
వైద్య, ఆరోగ్యశాఖ డైరెక్టర్ రవీందర్‌నాయక్
మంచిర్యాల, ఆగస్టు 11 (విజయక్రాంతి): వాతావరణ మార్పులతో వ్యాధులు ప్రబలుతున్నందున వైద్యులు, సిబ్బంది సమయ పాలన పాటించాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ డైరెక్టర్ రవీందర్‌నాయక్ సూచించారు. ఆదివారం నస్పూర్ పీహెచ్‌సీ, మందమర్రిలోని దీపక్‌నగర్ యూపీహెచ్‌సీలను సంద ర్శించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమీ క్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రజలతో వైద్యులు సత్సంబంధాలు పెంచుకోవాలని, ప్రజల్లో ప్రభుత్వ ఆసుపత్రులపై నమ్మకాన్ని కలిగించాలని సూచించారు. ప్రేమపూర్వకంగా వైద్య సేవలు అందించాలన్నారు. ప్రజలకు పారిశుధ్యంపై, ఆరోగ్య రక్షణపైన అవగాహన కల్పించాలని సూచించారు. ఆయనవెంట డీఎంఅండ్‌హెచ్‌వో హరీష్‌రాజ్ తదితరులు ఉన్నారు.