calender_icon.png 1 August, 2025 | 11:52 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వ్యాధుల పట్ల వైద్యులు అప్రమత్తంగా ఉండాలి

30-07-2025 12:00:00 AM

ఐటీడీఏ పిఓ రాహుల్

భద్రాచలం, జులై 29 (విజయ క్రాంతి):వర్షాకాలంలో ఆదివాసి గిరిజన గ్రామాలలో వైరల్ ఫీవర్ డెంగు, మలేరియా వ్యాధులు ప్రభలే అవకాశం ఉన్నందున భద్రాచలం ఏరియా ఆసుపత్రికి వచ్చే రోగుల పట్ల డాక్టర్లు ప్రత్యేక శ్రద్ధ చూపి అన్ని రకాల టెస్టులు నిర్వహించి వ్యాధి నిర్ధా రణ అయితే తప్పనిసరిగా వైద్య సేవలు అందించాలని ఐటీడీఏ పీవో రాహుల్ ఆదేశించారు. ముఖ్యంగా గర్భిణీ స్త్రీల పట్ల ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

మంగళవారం భద్రాచలంలోని ప్రభుత్వ ఏరియా వైద్యశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి లేబరేటరీ, ఆపరేషన్ థియేటర్, గర్భిణీ స్త్రీల కాన్పులగది, కంటి ఆపరేషన్ల వార్డు, అల్ట్రా సౌండ్ స్కానింగ్ గది, రికార్డులను పరిశీలించారు. గిరిజనులకు అందిస్తున్న వైద్య సౌకర్యాల గురించి ఆసుపత్రి పర్యవేక్షకుడు రామకృష్ణను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మా రుమూల ప్రాంత ఆదివాసి గిరిజన గ్రామాల నుండి వివిధ రకాల జబ్బులకు వైద్యం చేయించుకోవడానికి గిరిజనులు వస్తూ ఉంటారని, వారికి సరైన వైద్యం చేసి మందులు అందజేయాలన్నారు.

గర్భిణీ స్త్రీలు ఇబ్బంది పడకుండా వారి గ్రామాల నుండి అంబులెన్స్ లో తీసుకొని రావాలని, డెలివరీ అయ్యే వరకు పుట్టిన బిడ్డ ఆరోగ్యంగా ఉన్నది లేనిది పరిశీలించి, తల్లి తోపాటు బిడ్డ కూడా సక్రమంగా వైద్య చికిత్సలు చేయాలని అన్నారు. పీహెచ్సీ పరిధిలో పనిచే సే సిబ్బంది గర్భిణీ స్త్రీల పట్ల జాగ్రత్తలు తీసుకొని వారికి నెలసరి చికిత్సలు ఏ విధంగా తీసుకోవాలో అవగాహన కల్పించాలని అన్నారు. అనంతరం వివిధ వార్డులలో చికిత్స పొందుతున్న రోగులను ఆస్పత్రిలో వైద్య సేవలు సక్రమంగా అందుతున్నది, లేనిది అడిగి తెలుసుకున్నారు. అనంతరం గర్భిణీ స్త్రీలు సమయానుకూలంగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో సంబంధిత వైద్య సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.

లేబరేటరీ మరియు వార్డులలో ఏమైనా మైనర్ రిపేర్లు ఉంటే దానికి సంబంధించిన ప్రతిపాదనలు తనకు సమర్పించాలని ఆసుపత్రి పర్యవేక్షకుడు రామకృష్ణకు సూచిం చారు.అంతకు ముందు ఐటీడీఏ ప్రాంగణంలోని వైటీసీ పక్కన గల గిరిజన మహిళ ఆరోగ్య కార్యకర్తల శిక్షణా కేంద్రాన్ని సందర్శించి, శిక్షణ తీసుకుంటున్న మహిళలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా వారికి అన్ని సౌకర్యాలు కల్పించాలని, ముఖ్యంగా కరెంటు మంచినీటి సౌక ర్యం, టాయిలెట్లు, బాత్రూంలు, డోర్లు వారికి సౌకర్యంలా ఉండేలా మరమ్మత్తు లు చేయించాలని సంబంధిత ఇంజనీరింగ్ అధికారులకు సూచించారు.ఈ కార్యక్రమంలో ఏ డి ఎం హెచ్ ఓ సైదులు, ఏటీడీఓ అశోక్ కుమార్, ఈ ఈ ట్రైబల్ వెల్ఫేర్ హరీష్, డిప్యూటీ డిఎంహెచ్‌ఓ చైతన్య, టి ఏ శ్రీనివాస్, హెచ్ ఈ వోలు కృష్ణయ్య, లింగా నాయక్, శిక్షణ కేంద్రం ట్యూట ర్లు లక్ష్మి, పావని, వార్డెన్ సుశీల, ఏరియా ఆసుపత్రి డాక్టర్లు వైద్య సిబ్బంది పాల్గొన్నారు.