09-07-2025 12:00:00 AM
కామారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా ఎర్రం చంద్రశేఖర్
కామారెడ్డి, జూలై 8 (విజయక్రాంతి) ః ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ కామారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా ఎర్రం చంద్రశేఖర్ ను నియమించడం జరిగిందని ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ సేవాదళ్ రాష్ర్ట చైర్మన్ డాక్టర్ బాలు తెలియజేశారు. ఈ నియామక పత్రాన్ని ఐవిఎఫ్ సెంట్రల్ అడ్వుజరీ బోర్డు కమిటీ చైర్మన్ గంజి రాజమౌళి గుప్త, జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ర్ట అధ్యక్షులు ఉప్పల శ్రీనివాస్ గుప్త హైదరాబాద్‌లో నియామక పత్రాన్ని అందజేయడం జరిగింది.
దేశవ్యాప్తంగా ఉన్న వైశ్యులను ఏకం చేయడం కోసం ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్‌ను ఏర్పాటు చేయడం జరిగిందని, కామారెడ్డి జిల్లాలో ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్‌ను బలోపేతం చేసి, పేద ఆర్యవైశ్యులకు అండగా నిలవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రాష్ర్ట ప్రధాన కార్యదర్శి పబ్బ చంద్రశేఖర్ చంద్రశేఖర్, కోశాధికారి కొడిపాక నారాయణ,రాష్ర్ట యువజన విభాగం అధ్యక్షుడు కట్ట రవికుమార్, మేడ్చల్ అధ్యక్షులు సంబు పాండయ్య లు పాల్గొన్నారు.