calender_icon.png 17 November, 2025 | 5:39 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గోవులను తరలిస్తున్న లారీ పట్టివేత

16-11-2025 12:00:00 AM

ఘట్‌కేసర్, నవంబర్ 15 (విజయక్రాంతి) : అక్రమంగా గోవులను తరలిస్తున్న లారీని ఘట్ కేసర్ పోలీసులు పట్టుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం శనివారం వాహనాల చెకింగ్‌లో భాగంగా మధ్యాహ్నం రెండు గంటలకు అక్రమంగా 40 పశువులను లారీలో తరలిస్తుండగా పట్టుకొని కేసు నమోదు చేసి ఇట్టి పశువులను జియాగూడ లోని గోశాలకు తరలించినట్లు తెలిపారు. డ్రైవర్ ను అదుపులోకి తీసుకొని లారీని స్వాధీనం చేసుకున్నారు.