17-11-2025 03:40:41 PM
కమాన్ పూర్,(విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్ మండల కేంద్రంలోని స్వయంభు, ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ ఆదివరాహ స్వామి వారిని సోమవారం రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మెన్ బక్కి వెంకటయ్య, కమిషన్ సభ్యులు దర్శించుకున్నారు. ఆలయ పండితులు వారికి పూర్ణకుంభంతో స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించి, వేద మంత్రాలతో ఆశీర్వదించారు. కమిషన్ సభ్యులు నీలాదేవి, కొంకటి లక్ష్మీనారాయణ, జిల్లా శంకర్, రేణికుంట్ల ప్రవీణ్, నీనవత్ రాంబాబు తదితరులు ఆదివరాహస్వామిని దర్శించుకున్న వారిలో ఉన్నారు.