calender_icon.png 17 November, 2025 | 5:32 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పెద్దముల్ పోలీస్ స్టేషన్‌లో " థర్డ్ డిగ్రీ"

17-11-2025 03:46:48 PM

నేరం ఒప్పుకోవాలని తీవ్రంగా కొట్టారు...బాధితుడు ఆరోపణ

పెద్దెముల్ పోలీస్ స్టేషన్లో ఘటన..

తాండూరు,(విజయక్రాంతి): వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలం మంబాపూర్ గ్రామానికి చెందిన ఫిరోజ్ అనే వ్యక్తినీ విచారణ చేయాలంటూ పోలీస్ స్టేషన్ కు పిలిపించి థర్డ్ డిగ్రీ (చితకబదిన) ఉపయోగించిన ఎస్సై వేణుకుమార్, మరియు సిబ్బంది. పూర్తి వివరాల్లోకి వెళితే రెండు నెలలకు క్రితం మంబాపూర్ గ్రామానికి చెందిన గౌస్ అనే వ్యక్తి కౌలు పొలంలో అనుమానాస్పద మృతి కేసు నమోదు చేసిన నమోదయింది.

గౌస్ మృతికి సంబంధించి రిపోట్స్ ఓచ్చాయంటూ అల్లుడైన ఫిరోజ్ కు ఫోన్ చేసి పీఎస్ కు రప్పించి ఫిరోజ్ ని లోపలికి తీసుకెళ్లి కాళ్లపై, చేతులపై పోలీసులు కొట్టారు. కొట్టడమే కాకుండా గౌస్ ను తానే చంపినట్టు ఒప్పుకోవాలని  ఒత్తిడి తెచ్చారని బాధితుడు ఫిరోజ్ ఆరోపిస్తున్నాడు. అంతేకాదు పోలీసులు కొట్టిన విషయాన్ని ఎవ్వరికి చెప్పోదంటూ పోలీసులు తనకు వేడుకున్నారని తెలిపాడు. చికిత్స నిమిత్తం బాధితుడు ఫెరోజ్ ని తాండూర్  ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన కుటుంబ సభ్యులు.