10-07-2025 07:21:14 PM
ఏఎంసీ మాజీ చైర్మన్ ఆత్రం భగవంత్ రావు..
సిర్పూర్ యు (విజయక్రాంతి): రక్తదానం చేదాం ప్రాణదాతలమవుదాం అని వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఆత్రం భగవంత్ రావు పిలుపునిచ్చారు. గురువారం ఆయన పుట్టినరోజు వేడుకలను మండల కేంద్రంలో బీఆర్‌ఎస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భగవంత్ రావు మాట్లాడుతూ... నా పుట్టినరోజుని శుభాకాంక్షలతో కాకుండా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు. ఆసుపత్రుల్లో అనేక మంది రక్తం లేక ఇబ్బందులు పడుతున్నారని రక్తదానం చేయడం ద్వారా వారికి జీవదానం చేసినవారిగా నిలవవచ్చు అని చెప్పారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ కూడ్మే త విశ్వనాథ్, సింగిల్ విండో చైర్మన్ కేంద్రే శివాజీ, బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు తొడసం ధర్మారావు, మాజీ సర్పంచ్ ఆత్రం ప్రకాష్, నాయకులు అర్క నాగోరావ్, కుంరం భీంరావ్, గ్రామ పటేల్ ఆత్రం ఆనంద్ రావు తదితరులు పాల్గొన్నారు.