10-07-2025 07:19:23 PM
బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు సంకినేని వెంకటేశ్వరరావు..
తుంగతుర్తి (విజయక్రాంతి): గురుపూర్ణిమ సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని రిటైర్డ్ ఎంప్లాయిస్ బిల్డింగ్ లో మండల పార్టీ అధ్యక్షులు నారాయణదాసు నాగరాజు అధ్యక్షతన గురుపూజోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు సంకినేని వెంకటేశ్వరరావు హాజరయ్యారు.
సందర్భంగా రిటైర్డ్ ఉపాధ్యాయులు పాలవరపు సంతోష్, కాసం మల్లయ్య, ఓరుగంటి అంతయ్య, మిట్టగడపు పురుషోత్తం, దుగ్యాల మాధవరావు, గురుస్వాములు ప్రతాప్, నరేందర్, స్వర్గం సత్యనారాయణలను ఘనంగా శాలవాలతో సన్మానం చేసి, మాట్లాడుతూ కుల మతాలకు అతీతంగా జరిగే కార్యక్రమం గురుపూజోత్సవ కార్యక్రమం.. అన్ని రంగాలలో ఉన్న గురువులను ప్రతి శిష్యుడు సన్మానించుకోవాల్సిన అవసరం ఉంది.. మనకు జ్ఞానాన్ని జీవన విలువలను బోధించిన గురువులకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కన్వీనర్ కాప రవికుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లెపాక సాయిబాబా, మండల పార్టీ అధ్యక్షులు వేల్పుల బంగారు రాజు, కూర శంకర్, చాడా మంజుల రెడ్డి, జిల్లా నాయకులు గాజుల మహేందర్, జిల్లా కౌన్సిల్ సభ్యులు భూతం సాగర్ యాదవ్ మరియు ముఖ్య నాయకులు పాల్గొన్నారు.