16-07-2025 12:13:26 AM
ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే బీఎల్‌ఆర్
కాప్రా జులై 15 (విజయక్రాంతి) ఈ నెల 19వ తేదీన బీఆర్‌ఎస్ విద్యార్థి విభాగం కార్యకర్తలకు ఉప్పల్ నియోజకవర్గం మల్లాపూర్ లో శిక్షణా తరగతులు నిర్వహించనున్నారు. మల్లాపూర్ డివిజన్లోని వీఎన్‌ఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్లో నిర్వహించనున్న శిక్షణ కార్యక్రమ ఏర్పాట్లను మంగళవారం ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి పరిశీలించారు.
కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్, బీఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు సోమ శేఖర్ రెడ్డి, మాజీ కార్పొరేషన్ చైర్మన్ రాకేష్, బీఆర్‌ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుంగ బాలు, స్థానిక కార్పొరేటర్ దేవేందర్ రెడ్డితో పాటు పలువురు బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను, వారి అసత్య ప్రచారాలను ప్రజల్లోకి తీసుకెళ్లి, బీఆర్‌ఎస్ చేసిన అభివృద్ధిని చాటి చెప్పేలా కార్యకర్తలకు దిశానిర్దేశంచేయనున్నారు.