17-07-2025 06:10:26 PM
దేవాలయ చైర్మన్ నల్లపాటి నరసింహారావు
కోదాడ: కోదాడ మండల పరిధిలోని నల్లబండ గూడెం గ్రామంలో శ్రీ సాయి మందిరంలో గురు పౌర్ణమి వేడుకలకు సహకరించిన దాతలను, కమిటీ సభ్యులను దేవాలయ చైర్మన్ నల్లపాటి నరసింహారావు ఆధ్వర్యంలో ఘన సన్మాన కార్యక్రమం గురువారం నిర్వహించారు. దేవాలయానికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు. దాతల సహకారం మరువలేనిదన్నారు. దాతలు సహకరించడం వల్లనే ప్రతి గురువారం అన్నదాన కార్యక్రమాలు గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.