17-07-2025 06:02:07 PM
కొండపాక: ప్రభుత్వం ఆయిల్ ఫామ్ తోటలకు అందించే సబ్సిడీలను రైతులు వినియోగించుకోవాలని కొండపాక మండల అగ్రికల్చర్ ఆఫీసర్ శివరామకృష్ణ అన్నారు. కొండపాక మండలం బందారం గ్రామంలో గురువారం నిర్వహించిన మెగా ఆయిల్ ఫామ్ ప్లాంటేషన్ లో భాగంగా కామిరెడ్డి నరసింహారెడ్డి పొలంలో ఐదు ఎకరాల విస్తీర్ణంలో 285 మొక్కలను నాటమని, తెలంగాణ ప్రభుత్వం ఆయిల్ ఫామ్ పంట సాగు మొక్కలకు కేవలం రూ 20, డ్రిప్ పరికరాలు, ఎస్సీ ఎస్టీ రైతులకు 100 శాతం, ఇతర రైతులకు 90 శాతం సబ్సిడీ అందజేస్తుందని, నాలుగు సంవత్సరాల పాటు పంట నిర్వహణ ఖర్చులు, ప్రభుత్వం నుంచి ప్రోత్సాహకం లభిస్తాయన్నారు. రైతులందరూ ఆయిల్ ఫాం తోటల సాగు కి ముందుకు రావాలని రైతులను కోరారు.