calender_icon.png 24 November, 2025 | 11:44 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పేదింటి ఆడబిడ్డకు పుస్తె మట్టెల బహూకరణ

11-02-2025 12:00:00 AM

కొల్చారం, ఫిబ్రవరి 10: పేదింటి ఆడ బిడ్డల పెళ్లిళ్లకు తన వంతు సహాయం అంది స్తున్నారు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రాంరెడ్డి రఘువీరారెడ్డి. సోమవారం కొల్చారం మండలం చిన్నఘనపూర్ గ్రా మంలో ధన్నారాం పోచమ్మ, రాజయ్య కుమార్తె నందిని వివాహానికి తనవంతుగా పుస్తె మెట్టలను బహుకరించారు. 

బిజెపి మండల పార్టీ అధ్యక్షుడు ఘనపూర్ హరీష్, ఘనపూర్ బూత్ అధ్యక్షులు నాయకోటి గోవర్ధన్, బిజెపి సీనియర్ నాయకులు అంజా గౌడ్ , బాబా గౌడ్, బూత్ ప్రధాన కార్యదర్శి బి.మల్లేష్ , కొత్త కిరణ్, దేవు కిసాన్, దెబ్బనూరి మల్లేష్, బీజేవైఎం నాయకులు పుల బోయిన పెంటయ్య పాల్గొన్నారు.