calender_icon.png 25 September, 2025 | 10:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శివాలయం పునర్నిర్మాణానికి 'దొంగరి గోపి' ఔదార్యం

25-09-2025 08:29:49 AM

- రూ.2 లక్షల విరాళం అందజేత

- మరో 3 లక్షలు ఇస్తానని హామీ

పెన్ పహాడ్ : గ్రామ ఆధ్యాత్మిక అభివృద్ధి, శివాలయం పునర్నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలు  విరాళంగా ప్రకటించి ఔదర్యం చాటుకున్నాడు మండలంలోని లింగాలకు చెందిన యువ పారిశ్రామిక వేత్త, దాత దొంగరి గోపి. ఈసందర్బంగా ఆలయ నిర్మాణ కమిటీకి తన వంతుగా బుధవారం రూ. 2లక్షలు నగదు అందజేయగా మరో రూ. 3 లక్షలు కూడా త్వరలో ఇవ్వనున్నట్లు హామీ ఇచ్చారు. ఆయన గ్రామస్తులను, భక్తులనుద్దేశించి మాట్లాడుతూ..దేవాలయాన్ని అందంగా తీర్చిదిద్దితేనే గ్రామంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంటుందని ఇలాంటి సేవా కార్యక్రమాలతో పాటు గ్రామాభివృద్ధి,  పేద ప్రజల అభ్యున్నతికి ఎల్లప్పుడూ తాను ముందుంటానని దాత హామీ ఇచ్చారు. దేవాలయాలు కేవలం ఆధ్యాత్మిక కేంద్రాలు మాత్రమే కాకుండా, గ్రామ ఐక్యతకు ప్రతీకలని వాటిని సంరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యతగా గుర్తించాలని దాత గోపి పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆలయ నిర్మాణ కమిటీ చైర్మన్ దాచేపల్లి సుధాకర్,  జూకూరు గాంధీ, నల్ల శ్రీనివాస్, రత్నమాల తదితరులు ఉన్నారు.