calender_icon.png 25 September, 2025 | 10:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గ్రామీణ క్రీడలకు ప్రోత్సాహాన్ని అందించాలి

25-09-2025 08:27:12 AM

గరిడేపల్లి,(విజయ క్రాంతి): గ్రామాలలో నిర్వహించే క్రీడలను ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాలని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు త్రిపురం అంజన్ రెడ్డి అన్నారు.మండలంలోని వెలిదండ గ్రామంలో నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలను గరిడేపల్లి ఎస్ఐ చలికంటి నరేష్ తో కలిసి బుధవారం ఆయన ప్రారంభించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామాలలో కనబరుగవుతున్న ఆటలను నేటి యువత అందిపుచ్చుకొని ప్రోత్సహించాలని ఆయన కోరారు.

గ్రామాలలో క్రీడా పోటీలు నిర్వహించడం ద్వారా సమైక్యతను పెంపొందించుకునే అవకాశం ఉంటుందని తెలిపారు.కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి పెండెం శ్రీనివాస్ గౌడ్,హుజూర్నగర్ నియోజకవర్గం యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు మహేష్ గౌడ్,సూర్యాపేట జిల్లా కబడ్డీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి నామ నరసింహారావు,శ్రీనివాస్ రెడ్డి,కొత్తగూడెం మాజీ సర్పంచ్ నాగరాజు,తెలంగాణ మలిదశ ఉద్యమకారుల కన్వీనర్ మేకల నాగేశ్వరరావు,కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు చనగాని సాంబయ్య,మాజీ సర్పంచ్ ఆదోరి పద్మ కోటయ్య,నాయకులు ఎలుగూరి నరసింహారావు,వెంకటేశ్వర్లు,చనగాని సాంబయ్య,వీసాల వెంకటేశ్వర్లు,చెనగాని రామయ్య, సిపిఎం మండల కమిటీ సభ్యులు యానాల సోమయ్య,రిటైర్డ్ ఎంఈఓ సీతారాములు,ఆదోని శ్రీను,మా శెట్టి నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.