10-02-2025 01:09:22 AM
హుజురాబాద్, ఫిబ్రవరి 9: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత వి నరేందర్ రెడ్డి భారీ మెజార్టీతో మండలికి వెళ్లడం ఖాయమని హుజూరా బాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితెల ప్రణవ్బా బు అన్నారు.
ఆదివారం హుజూరాబాద్ పట్టణంలోని సిటీ సెంట్రల్ కన్వెన్షన్ హాల్లో జరిగిన ఆత్మీయ సమ్మేళ నంలో ఆయన ముఖ్య అతిథిగా నరేందర్ రెడ్డితోపాటు హాజరయ్యారు. ఈ సంద ర్భంగా ప్రణవ్ మాట్లాడుతూ పట్టభద్రులు ఓటును వృథా చేసుకోవద్దని, ఓటు వేసేట ప్పుడు జాగ్రత్తగా వేయాలని సూచించారు.
హుజూరాబాద్ నియోజకవర్గ వ్యాప్తంగా 13 వేల పట్టభ ద్రుల ఓట్లు ఉన్నాయని, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఎన్‌ఎస్యూఐ, యూత్ కాంగ్రెస్, కాంగ్రెస్ అనుబంధ సంఘాలు పనిచేసి హుజూరాబాద్ నుంచి అత్యధిక మెజార్టీ ఇవ్వాలని కోరారు.
ఈ కార్యక్ర మంలో జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షు రాలు సత్యప్రసన్న రెడ్డి, హుజూరాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గూడూరి రాజేశ్వరి స్వామి రెడ్డి, సింగిల్ విండో చైర్మన్ సుగుణాకర్ రెడ్డి, నాయకులు కొలిపాక శంకర్, కిరణ్ కుమా ర్, పుష్పలత, రాధ, రాహుల్, రాజు, సొల్లు బాబు, లావ ణ్య, తదితరులు పాల్గొన్నారు.