calender_icon.png 26 October, 2025 | 2:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీజేపీకి ఫార్మాకంపెనీల 945 కోట్ల ముడుపులు

26-10-2025 12:06:18 AM

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ ఆరోపణలు

భోపాల్, అక్టోబర్ 25: ఫార్మాల కంపెనీ నుంచి మధ్యప్రదేశ్ ప్రభుత్వంతో పాటు కేంద్రంలోని బీజేపీకి రూ.945 కోట్ల ముడుపులు అందాయని, అందుకే ఆయా కంపెనీలు నిబంధనలు ఉల్లంఘించి, పిల్లల చావులకు కారణమవుతున్నాయని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ ఆరోపించారు. ‘కోల్డ్రిఫ్’ వినియోగించి ఇటీవల మధ్యప్రదేశ్‌లోని చింద్వారా ప్రాంతానికి చెందిన 26 మంది పిల్లల మృతిచెందిన విషాదంపై శనివారం భోపాల్‌లో నిర్వహించిన మీడియా సమావేశం లో ఆయన మాట్లాడారు.

కోల్డ్రిఫ్ ఫార్మాకంపె నీ తయారు చేసిన దగ్గుమందులో 48.6 శాతం కంటే ఎక్కువ డై ఇథైలీన్ గ్లుకాల్ ఉందని తేలిందని, వాస్తవానికి ఆ శాతం 0.01 శాతానికి మించకూడదని వివరించారు. సిరప్‌లో విషపూరిత రసాయనాలు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ దర్యాప్తులో తేలిందని, దీనికి రాష్ట్రప్రభుత్వం ఏం సమాధానం చెప్తుందని నిలదీశారు.