26-10-2025 12:04:20 AM
న్యూఢిల్లీ, అక్టోబర్ 25: ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయు గుండంగా మారింది. రాగల 24 గంటల్లో వాయుగుండం తీవ్రతరమైన వాయుగుండంగా మారనుంది. సోమవారం ఉదయా నికి వాయవ్య దిశలో కదిలి మంగళవారం నాటికి తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉంది. ‘మోంథా’గా నామకరణం చేసిన ఈ తుపాను ఇదే రోజు ఏపీలోని కాకినాడ వద్ద తీరం దాటునుంది. ఈ వ్యవధిలో గంటకు 90 కి.మీ నుంచి 110 కి.మీ వేగంతో గాలు లు వీస్తాయని హెచ్చరించింది.
తుపాన్ ప్రభావం రెండు తెలుగు రాష్ట్రాల్లో బలంగా ఉంటుందని, నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణశాఖ ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్‌కు రెడ్ అలె ర్ట్ జారీ చేసింది. కొన్నిచోట్ల అతిభారీ వర్షాలు, మరికొన్నిచోట్ల ఈదురుగాలులతో కూడి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. తుపా ను ప్రభావం ఆంధ్రప్రదేశ్‌పై ఎక్కువగా ఉం టుందని వాతావరణశాఖ ప్రకటించింది.
తుపాన్ ప్రభావంతో ఆ రాష్ట్రంలో 26, 27, 28, 29వ తేదీల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. మచిలీపట్నం, దివిసీమ, విజయవాడ, గుంటూరు, ఏలూరు, గోదావరి తీర ప్రాంతాల్లో వర్ష తీవ్రత ఎక్కువగా ఉంటుందని తెలిపింది. తీర ప్రాంత జిల్లాల్లోని విద్యా సంస్థలకు ఇప్పటికే అక్కడి ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లకూ డదని హెచ్చరించింది.
తదుపరి సూచనలు వచ్చేవరకు బోట్లను లంగరు వేసి ఉంచాలని సూచించింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తుపాను సమయంలో అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని విజ్ఞప్తి చేసింది. దక్షిణ తెలం గాణ జిల్లాలైన ఖమ్మం, మహబూబాబాద్, నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్ ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. ఆయా జిల్లాల్లో 7 సెంమీ నుంచి 12 సెంమీ వరకు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. హైదరాబాద్‌లోనూ కొద్దిపాటి జల్లులు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.