15-07-2025 05:38:04 PM
నిర్మల్,(విజయక్రాంతి): సమాజ అభివృద్ధిలో పాత్రికేయుల పాత్ర కీలకమని ఐటిఐ కళాశాల ప్రిన్సిపల్ కృష్ణమూర్తి అన్నారు. నిర్మల్ ప్రెస్ కు మంగళవారం బ్లూ స్టార్ వాటర్ ఫిల్టర్ ను అందించారు. అలాగే బిజెపి పట్టణ అధ్యక్షులు సాద అరవిందు ఐదు ఫ్యాన్లు విరాళంగా అందించారు. పాత్రికేయులకు చేయూతనందించేందుకు తమ వంతు సహకారాన్ని అందిస్తామని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా దాతలకు నిర్మల్ ప్రెస్ క్లబ్ సభ్యులు సన్మానం చేశారు.