15-07-2025 05:41:28 PM
మందమర్రి,(విజయక్రాంతి): గ్రామీణ ఉపాధి హామీ పథకం మండల ఏపీవో రజియా సుల్తాన ను కాంగ్రెస్ నాయకులు ఘనంగా సన్మానించారు. మండల పరిషత్ కార్యాలయం లో మంగళవారం ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఇటీవల డాక్టరేట్ సాధించిన ఈజిఎస్ ఎపివో రజియాను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో ఎన్.రాజేశ్వర్ మాట్లాడుతూ... గ్రామీణ ఉపాధి హామీ పథకంలో ఏపీఓ గా విధులు నిర్వహిస్తూ నిరుపేదలకు ఉపాధి కల్పించడమే కాకుండా, వారి కోసం అనేక సేవా కార్యక్రమాలు చేపట్టి డాక్టరేట్ సాధించడం గర్వకారణం అన్నారు. మండలంలోని ప్రతి అధికారి తమవంతుగా సామాజిక సేవ చేసి ప్రజల మన్ననలు పొందా లని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎంపిఓ సత్యనారాయణ, కాంగ్రెస్ పార్టీ మండల ఇంచార్జ్ కడారి జీవన్ కుమార్, నాయకులు మాసు సంతోష్ కుమార్, రాజన్న కాపురపు సతీష్, నీలం ఆనంద్, రేగుంట రాజయ్య, ఉప్పరి శ్రీను లు పాల్గొన్నారు.