15-07-2025 05:34:53 PM
నల్లగొండ టౌన్,(విజయక్రాంతి): జిల్లా పోలీస్ కార్యాలయంలోని గడువు తీరిన వివిధ రకాల పాత టెంట్లు,ఐటీ విభాగానికి చెందిన కంప్యూటర్లు, పర్నిచర్ వేలం ఈనెల 19న జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ మంగళవారం తెలిపారు. ఈ వేలంలో వివిధ రకాల పాత టెంట్లు,ఐరన్ లీడింగ్ చైన్లు, కార్పెట్లు,హెల్మెట్లు,ఐటీ విభాగానికి చెందిన పర్నిచర్, కంప్యూటర్లు, ప్రింటర్లు,తదితర విడి విభాగాలు వేలం వేయనున్నారని అన్నారు. వేలంలో పాల్గొనేవారు శనివారం రోజున ఉదయం 10 గంటలకు జిల్లా కార్యాలయంలో నిర్వహించే వేలంలో పాల్గొనగలరని తెలిపారు. పూర్తి వివరాల కొరకు వెల్ఫేర్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ సంతోష్ 8712670169 ని సంప్రదించాలని అన్నారు.