calender_icon.png 11 October, 2025 | 7:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అవయవదానం ద్వారా ఇతరులకు కొత్త జీవితం ఇచ్చే దాతలు స్ఫూర్తిదాయకులు

10-10-2025 12:40:11 AM

సదాశివ ఫౌండేషన్ 17వ వార్షికోత్సవం లో రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్

 గోదావరిఖని, అక్టోబర్ 9(విజయ క్రాంతి) అవయవదానం ద్వారా ఇతరులకు కొత్త జీవితం ఇచ్చే దాతలు స్ఫూర్తిదాయకులని సదాశివ ఫౌండేషన్ 17వ వార్షికోత్సవంలో రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ అన్నారు. గురువారం గోదావరిఖని సీమ్స్ కాలేజీలో నిర్వహించిన సదాశయ ఫౌండేషన్ 17వ వార్షికోత్సవంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. సదాశయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నేత్ర, అవయవ, శరీర దానం చేసిన కుటుంబాలను ఎమ్మెల్యే సత్కరించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మానవతా విలువలను నిలబెట్టే ఈ రకాల సేవా కార్యక్రమాలు సమాజానికి ఆదర్శప్రాయమైనవి. అవయవదానం ద్వారా ఇతరులకు కొత్త జీవితం ఇచ్చే దాతలు, వారి కుటుంబాలు స్ఫూర్తిదాయకులని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ ప్రతినిధులు, వైద్యులు, కళాశాల సిబ్బంది, విద్యార్థులు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.