calender_icon.png 11 October, 2025 | 1:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్లాస్టిక్‌తో పర్యావరణానికి ముప్పు

10-10-2025 12:41:10 AM

సూర్యాపేట, అక్టోబర్ 9 (విజయక్రాంతి) : సింగిల్ యూజ్ ప్లాస్టిక్తో పర్యావరణానికి ముప్పు వాటిల్లుతుందని ప్రముఖ వ్యాపారవేత్త యామ ప్రభాకర్ అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలోని బాలభవన్ లో ప్లాస్టిక్ వాడకంపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తూ క్లాత్ సంచులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్లాస్టిక్ సముద్రాలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయన్నారు.

తద్వారా సముద్ర జీవులకు హాని కల్గిస్తున్నాయన్నారు. తాబేళ్లు, సీల్స్, పక్షులు, జంతువులు ప్లాస్టిక్ వ్యర్థాలలో చిక్కుకుని గాయాలు, మరణానికి గురవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అనేక దేశాలు ప్లాస్టిక్ సంచులు, సింగిల్ యూజ్ ప్లాస్టిక్లను నిషేధించాయన్నారు.

ప్రపంచ వ్యాప్తంగా 9 శాతం ప్లాస్టిక్ వ్యర్థాలను మాత్రమే రీసైకలింగ్ చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సైన్స్ అధికారి దేవరాజ్, బండి రాధాకృష్ణ రెడ్డి, వీరు నాయుడు, అరుంధతి, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.