07-10-2025 12:20:50 AM
చంద్రశేఖర్ కుటుంబీకులకు వీహెచ్ పరామర్శ
ఎల్బీనగర్, అక్టోబర్ 6 : అమెరికాలోని డల్లాస్ నగరంలో గుర్తు తెలియని వ్యక్తి జరిపిన కాల్పులో మృతి చెందిన చంద్రశేఖర్ కుటుంబ సభ్యులను సోమవారం బీఎన్ రెడ్డి నగర్ డివిజన్ టీచర్స్ కాలనీలో సీనియర్ కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ వి.హనుమంత రావు పరామర్శించారు.
ఈ సందర్భంగా మంత్రి అట్లూరి లక్ష్మణ్ తో మాట్లాడి చంద్రశేఖర్ మృతదేహాన్ని హైదరాబాద్ తీసుకువచ్చేందుకు తగిన చర్యలు తీసుకోవాలని, బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందచేయాలని హన్మంతరావు కోరారు.