calender_icon.png 7 October, 2025 | 2:20 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆ జ్ఞాపకాలు మదిలో మెదిలాయి

07-10-2025 12:21:59 AM

ఇరవై ఏళ్ల తర్వాత మళ్లీ ఒక్కచోట కలసిన పూర్వ విద్యార్థులు

మణికొండ, అక్టోబర్ 6 (విజయక్రాంతి): రెండు దశాబ్దాల నాటి ఆ జ్ఞాపకాలు ఒక్కసారిగా కళ్ళముందు కదిలాయి. ఆత్మీయ పలకరింపులు, యోగక్షేమాలతో ఆ ప్రాంగణం సందడిగా మారింది. నార్సింగి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 1990,-91 సంవత్సరంలో చదువుకున్న పూర్వ విద్యార్థులంతా ఆదివారం ఒక్కచోట చేరారు. స్థానిక కేవీఎంఆర్ గార్డెన్స్లో జరిగిన ఈ అపూర్వ సమ్మేళనంలో ఒకరినొకరు పలకరించుకుని, తమ కుటుంబాలు, చేస్తున్న పనుల గురించి మాట్లాడుకుంటూ పాత జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు.

ఈ సందర్భంగా తమకు విద్యాబు ద్ధులు నేర్పిన నాటి ఉపాధ్యాయులు సత్యనారాయణరెడ్డి, సీతాబాయిలను పూర్వ విద్యార్థులు శాలువాలతో సత్కరించి, వారి పాదాలకు నమస్కరించి ఆశీస్సులు అందుకున్నారు.  పూర్వ విద్యార్థులు వేణుకుమార్, వెంకటేశ్, విజయ్కుమార్, వెంకట్ రాంరెడ్డి, గిరిధర్రెడ్డి, సురేష్, సుమతి, భారతిబాయి, అనిత, లక్ష్మీలతో పాటు ఆ బ్యాచ్ విద్యార్థులంతా పాల్గొన్నారు.