07-10-2025 12:20:31 AM
మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్
మహబూబ్ నగర్ టౌన్, అక్టోబర్ 6: వసతి గృహాల్లో విద్యార్థుల నాణ్యమైన భోజనాన్ని అందించడంలో డైలీ కార్మికులుగా పనిచేస్తున్న వారిని ప్రభుత్వం పర్మినెంట్ చేసేలా ఒత్తిడి తీసుకువస్తామని మాజీ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. సోమవారం వసతి గృహాల్లో పనిచేస్తున్న డైలీ వర్కర్స్ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కలిసి వారి సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందించారు.
ఈ సందర్భంగా మాజీ మంత్రి మాట్లాడుతూ తమరి సమస్యలను పూర్తిస్థాయిలో పరిష్కారం అయ్యే రీతిగా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతామని తెలిపారు. వినతి పత్రం అందించిన వారిలో తెలంగాణ గిరిజన ఆశ్రమ పాఠశాలలు, హాస్టల్స్ డైలీవైజ్ వర్కర్స్ సంఘం సభ్యులు చిట్టెమ్మ, సురేష్, జ్యోతి, ఎల్లప్ప, అనసూయ, అరుణ, అంజిలమ్మ, పద్మమ్మ, మూలాల జి, అనిత, రజిత తదితరులు పాల్గొన్నారు.