calender_icon.png 4 November, 2025 | 6:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇంటి నిర్మాణ పనులు సకాలంలో పూర్తి చేయాలి

04-11-2025 12:56:37 PM

జిల్లా కలెక్టర్ వెంకటేష్, దోత్రే 

కుమ్రంభీంఆసిఫాబాద్,(విజయక్రాంతి): ఇందిరమ్మ ఇంటి నిర్మాణ పనులను(Indiramma house construction work) సకాలంలో పూర్తి జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే లబ్ధిదారులకు సూచించారు.మంగళవారం వాంకిడి మండలం జైత్ పూర్ గ్రామాన్ని సందర్శించి ఇందిరమ్మ ఇంటి నిర్మాణ పనులను పరిశీలించారు.గ్రామంలో ఇంటి నిర్మాణ పనులు పూర్తి కావడంతో కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని జిల్లాలో విజయవంతం చేసేందుకు అన్ని శాఖల సమన్వయంతో ముందుకు వెళ్లడం జరుగుతుందని తెలిపారు.లబ్ధిదారులు తమ ఇంటిని త్వరగా పూర్తి చేసుకునేందుకు శ్రద్ధ తీసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో హౌసింగ్ పీడీ వేణుగోపాల్,సంబంధిత అధికారులు పాల్గొన్నారు.