22-05-2025 12:24:09 AM
- హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్
- టోలీచౌకి పీఎస్‌లో మొదటి ఎఫ్‌ఐఆర్ పిటీషనర్‌కు అందజేత
కార్వాన్, మే 21: శాంతిభద్రతల విషయంలో ఎట్టి పరిస్థితుల్లో రాజీ పడొద్దని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ సూచించారు. బుధవారం ఉదయం 11:30 గంటలకు ఆయన నూతనంగా ఏర్పాటు చేసిన టోలిచౌకి పోలీస్ స్టేషన్ను సందర్శిం చి నిర్వహణ ప్రక్రియను పర్యవేక్షించారు. మొదటి పిటీషనర్‌కు ఆయన ఎఫ్‌ఐఆర్ కాపీని అందజేశారు.
కమిషనర్ పర్యటనను సౌత్ వెస్ట్ జోన్ డీసీపీ చంద్ర మోహన్, పలువురు ఏసీపీలు పర్యవేక్షించారు. గోల్కొండ, హిమాయత్‌నగర్, ఫిల్మ్‌నగర్ పోలీస్ స్టేషన్లను విభజించి నూతనంగా టోలిచౌకి పీఎస్ ను ఏర్పాటు చేశారు. అదేవిధంగా పోలీస్ స్టేషన్‌కు నాలుగు సెక్టార్లుగా విభజించారు. గత ఏప్రిల్ 30న టోలిచౌకి పీఎస్‌ను ఏర్పాటు చేస్తూ అధికారులు జీవో జారీ చేశారు. ఈ కార్యక్రమంలో గోల్కొండ ఎసిపి సయ్యద్ ఫయాజ్, పలువురు పోలీసు ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు.