22-05-2025 12:21:55 AM
- సీపీఐ జాతీయ కార్యదర్శి, మాజీ ఎంపీ సయ్యిద్ అజీజ్ పాషా
ముషీరాబాద్, మే 21 (విజయక్రాంతి): దేశంలో సాంస్కృతిక సహకారం ద్వారా శాంతిని పెంపొందించడానికి తీవ్రంగా కృషి చేసిన గొప్ప అభ్యుదయవాది టి.ఎస్. సుకుమారన్ అని సిపిఐ జాతీయ కార్యదర్శి, మాజీ ఎంపీ సయ్యిద్ అజీజ్ పాషా కొనియాడారు.
భారత సాంస్కృతిక సహకార, స్నేహ సంఘం (ఇస్కఫ్) జాతీయ కార్యదర్శిగా కొనసాగుతున్న టి.ఎస్. సుకుమారన్ విశాఖ పట్నంలోని తన స్వగృహంలో ఆకస్మికంగా మరణించడం పట్ల సయ్యిద్ అజీజ్ పాషా తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసారు. హైదరాబాద్ హిమాయత్ నగర్ మఖ్డూమ్ భవన్ సిపిఐ రాష్ట్ర కార్యాలయంలో బుధవారం భారత సాంస్కృతిక సహకార, స్నేహ సంఘం (ఇస్కఫ్), తెలంగాణ రాష్ట్ర శాఖ ఏర్పాటు చేసిన టీఎస్ సుకుమారన్ సంతాప సభలో సయ్యిద్ అజీజ్ పాషా తోపాటు ఇస్కఫ్ రాష్ట్ర అధ్యక్షులు రేఖల.
గోపాల్, ఐపీసో రాష్ట్ర సమ న్వయ ప్రధాన కార్యదర్శి కెవిఎల్, ఇన్సాఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మునీర్ పటేల్, ఇస్కఫ్ రాష్ట్ర నాయకులు ఎండి. మహబూబ్ తదితరులు అయన చిత్రపటానికి ఫూలమా లలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా సయ్యిద్ అజీజ్ పాషా మాట్లాడుతూ టీఎస్. సుకుమారన్ మరణం పట్ల అయన కుటుంబానికి ప్రగాఢ సం తాపం తెలియజేశారు.
కెవిఎల్ మాట్లాడుతూ సామ్రాజ్యవాదానికి వ్యతరేకంగా సమానత్వవాద సమాజం కోసం అనే క ఉద్యమాలలో టి.ఎస్. సుకుమారన్ క్రి యాశీలక పాత్ర పోషించారని గుర్తు చేసారు. ప్రజల నుండి ప్రజలకు సాంస్కృతిక అవగాహన, స్నేహాన్ని ప్రోత్సహించేందుకు అయ న విశేష కృషి చేసారని కొనియాడారు.