22-05-2025 12:24:39 AM
ఎల్బీనగర్, మే 21: ఎదురుదెరుగా వస్తు న్న వ్యాన్, కారు ఓ మూలమలుపు వద్ద ఢీకొనడంతో కారులో ఉన్న ముగ్గురు యువకు లు మృతిచెందారు. ఈ ఘటన హయత్ నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని కుంట్లూర్‌లో బుధవారం ఉదయం జరిగింది. కుంట్లూరు గ్రామానికి చెందిన నలుగురు విద్యార్థులు మంగళవారం రాత్రి పెద్ద అంబర్‌పేటలో ఓ ఫంక్షన్‌కు వెళ్లారు. రాత్రి నాంపల్లిలోని ఓ వ్యవసాయ క్షేత్రంలో బస చేశారు.
బుధవారం ఉదయం స్వగ్రామానికి కారు లో బయలుదేరారు. కుంట్లూర్ గ్రామంలోని నారాయణ కాలేజీ (బాసర క్యాంపస్) సమీపంలో పసుమాముల గ్రామం వైపు నుంచి కుంట్లూరు కారు వెళ్తున్నది. అదే సమయం లో కుంట్లూరు నుంచి పసుమాముల వైపు వస్తున్న వ్యాన్ మూల మలు పు వద్ద అతివేగంతో ఎదురెదురుగా ఢీకొన్నాయి.
ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న కుం ట్లూర్ గ్రామానికి చెందిన పిన్నింటి శ్రీనివాస్‌రెడ్డి కుమారుడు చంద్రసేనారెడ్డి (24), చుంచు జంగారెడ్డి కుమారుడు త్రినాథ్‌రెడ్డి (24), చుంచు శ్రీనివాస్‌రెడ్డి కుమారుడు వర్షిత్‌రెడ్డి(23) అక్కడికక్కడే మృతిచెందారు.
అలిమేటి శ్రీనివాస్‌రెడ్డి కుమారుడు పవన్‌కల్యాణ్‌రెడ్డి తీవ్రంగా గాయపడగా దవాఖా నకు తరలించారు. కారులో ఇరుక్కున్న మృతదేహాలను స్థానికులు అతికష్టమ్మీద బయటకు తీశారు. 2 నిమిషాలైతే ఎవరి ఇండ్లకు వారు చేరేవారని, అంతలోనే ప్రాణాలు గాలిలో కలిసి పోయాయని స్థానికుల వాపోయారు.