calender_icon.png 10 May, 2025 | 5:05 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ధాన్యం దిగుమతిలో జాప్యం జరగవద్దు!

10-05-2025 12:44:15 AM

- రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలి

 -జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు

కొండాపూర్, మే 9 :రైస్ మిల్లుల వద్ద ధాన్యం నిల్వలను దిగుమతి చేసుకోవడంలో జాప్యానికి తావులేకుండా పకడ్బం దీ చర్యలు చేపట్టాలని కలెక్టర్ క్రాంతి వల్లూరు అధికారులను ఆదేశించారు.

శుక్రవారం కొండాపూర్ మండలం గొల్లపల్లి గ్రా మంలో పీఏసీఎస్ ద్వారా నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని, గోడౌన్ ను, జిల్లా కలెక్టర్ సందర్శించారు.  కొనుగోలు కేంద్రాలకు రైతులు తరలించిన ధాన్యం నిల్వలను పరి శీలించారు. ఆయా కేంద్రాల ద్వారా ఇప్పటివరకు సేకరించిన ధాన్యం నిల్వల గురించి, మిల్లులకు తరలించిన ధాన్యం వివరాల రికార్డులను పరిశీలించారు.

మిల్లర్లు ధాన్యాన్ని ఎప్ప టికప్పుడు దిగుమతి చేసుకుని నిలువ చేసుకునేందుకు వీలు గా అందుబాటులో ఉన్న గోడౌన్లను గుర్తించాలని, హమాలీలు, లారీల కొరత నెలకొనకుండా ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో రవీందర్ రెడ్డి, పిఎసిఎస్ డైరెక్టర్లు, రెవెన్యూ అధికారులు  పాల్గొన్నారు.

రెవెన్యూ సదస్సులను వినియోగించుకోవాలి..

జిల్లాలో భూ భారతి పైలట్ ప్రాజెక్ట్ రెవెన్యూ సదస్సులలో భాగంగా శుక్రవారం కొండాపూర్ మండలం గొల్లపల్లి  గ్రా మంలో నిర్వహించిన సదస్సులో కలెక్టర్ క్రాంతి వల్లూరు పా ల్గొన్నారు.

రైతు గుర్తింపు కార్డుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ, హెల్ప్ డెస్క్, దరఖాస్తుల స్వీకరణ కౌంటర్ వద్ద సదుపాయాలు, సిబ్బంది పనితీరును కలెక్టర్ పరిశీలన జరిపి, అధికారులకు సూచనలు చేశారు. పైలట్ ప్రాజెక్టు కింద కొండాపూర్ మండలంలో రెవెన్యూ సదస్సులలో వచ్చిన దరఖాస్తులను పరిష్క రించిన మీదట, జిల్లాలోని మిగితా మండలాల్లో  రెవెన్యూ గ్రామాల వారీగా సదస్సులు నిర్వహిస్తామని పేర్కొన్నారు.